
కల్లూరు, వెలుగు: ప్రైవేటు రంగంలోని సహకార బ్యాంకులు ఖాతాదారులకు మెరుగైన సేవలందించాలని ఆర్యవైశ్య సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షుడు పసుమర్తి చందర్ రావు కోరారు. బుధవారం కల్లూరులో నూతనంగా ఏర్పాటు చేసిన భద్రాద్రి కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ను చైర్మన్ చెరుకూరి కృష్ణమూర్తి ప్రారంభించారు. క్యాష్ కౌంటర్ ను రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కల్లూరు ప్రెసిడెంట్ చారుగుండ్ల అచ్యుత సీతారామారావు ప్రారంభించారు.
చైర్మన్ కృష్ణమూర్తి మాట్లాడుతూ.. తమ బ్యాంక్ రూ.930 కోట్ల వ్యాపారం చేసిందని తెలిపారు. గృహ, వ్యాపార, విద్య, చిన్న తరహా పరిశ్రమలు, చిరు వ్యాపారులకు తక్కువ వడ్డీకి రుణాలను అందిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీఈవో దాసరి వేణుగోపాల్, బ్యాంకు డైరెక్టర్లు దేవత రాజారావు, మద్ది పిచ్చయ్య, సన్నే ఉదమ్ ప్రతాప్, వేములపల్లి వెంకటేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.