
తొర్రూరు, వెలుగు: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని రామకృష్ణ థియేటర్ సన్నూరు డొంక రోడ్డులోని సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎదురుగా సోమవారం భద్రాద్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ 19వ బ్రాంచ్ ను ప్రారంభించారు.
కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భద్రాద్రి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ చెరుకూరి వెంకటేశ్వర్లు హాజరయ్యారు. భద్రాద్రి కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు ను స్థానికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో బ్యాంక్ అధికారులు, తొర్రూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.