భద్రాచలం పర్యాటకులకు ఇబ్బందుల్లేకుండా చూడాలి : కలెక్టర్ ​జితేశ్​వి పాటిల్

భద్రాచలం పర్యాటకులకు ఇబ్బందుల్లేకుండా చూడాలి : కలెక్టర్ ​జితేశ్​వి పాటిల్
  • భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ ​జితేశ్​వి పాటిల్​ 

భద్రాచలం, వెలుగు : భద్రాచలం వద్ద గోదావరి తీరంలో పర్యాటకులకు ఇబ్బందుల్లేకుండా గుడారాలు ఏర్పాటు చేయాలని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్​ జితేశ్​ వి పాటిల్​ అధికారులకు సూచించారు. గుడారాలు ఏర్పాటు చేసే ప్రాంతాన్ని శుక్రవారం రాత్రి ఆయన పరిశీలించారు. గుడారాలతో పాటు కరకట్ట కింద స్నానఘట్టాల ప్రాంతంలో అటవీ ఉత్పత్తులతో ఏర్పాటు చేసే స్టాళ్ల పాయింట్లపై ఆఫీసర్లకు పలు సూచనలు చేశారు.

భక్తులు గుడారాల్లో బస చేసి, సెల్ఫీలు దిగేందుకు అనువైన ప్రాంతాలను రెడీ చేయాలన్నారు. పడవల్లో భక్తులు విహరించేందుకు మత్స్యకారులకు ట్రైనింగ్​ ఇచ్చి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. భద్రాచలం నుంచి బొజ్జిగుప్ప, బెండాలపాడు, పూబెల్లి, కిన్నెరసాని టూరిజం స్పాట్లకు వెళ్లేలా తగిన ప్రచారం కల్పించాలన్నారు. కలెక్టర్​ వెంట ఆర్డీవో దామోదర్​రావు, దేవస్థానం ఈవో రమాదేవి తదితరులు ఉన్నారు.