విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి : కలెక్టర్​ జితేశ్ ​​వి పాటిల్

  • భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్​ జితేశ్ ​​ 

సుజాతనగర్, వెలుగు : విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్​ జితేశ్ ​వి పాటిల్ ​సూచించారు. గురువారం మండలంలోని వేపలగడ్డలో వెనుకబడిన తరగతుల బాలుర గురుకుల విద్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అద్దె బిల్డింగ్ లో విద్యాలయాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని తెలుసుకొని వారం రోజుల్లో గురుకుల విద్యాలయ బిల్డింగ్, ఇతర సదుపాయాల ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. విద్యార్థులకు పౌష్టికారం అందించడంలో నిర్లక్ష్యం చేయొద్దని చెప్పారు. అనంతరం డేగలమడుగు గ్రామంలోని జిన్నింగ్ మిల్ ను పరిశీలించారు. రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. 

స్వెటర్లు పంపిణీ 

చుంచుపల్లి మండలం లోని షెడ్యూల్డ్ క్యాస్ట్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్​లోని బాలికలకు కలెక్టర్ స్వెటర్లను పంపిణీ చేశారు. హాస్టల్ ను సందర్శించి విద్యార్థినీలతో కలిసి భోజనం చేశారు.