
భద్రాచలం, వెలుగు: అంతరాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టుల్లో ఇప్పటివరకు ఎంత నగదు సీజ్‌చేశారు? ఎంత రిలీజ్ చేశారు? అభ్యర్థులు నిర్వహించే ర్యాలీలు, బహిరంగ సభలు, సమావేశాలు, రోడ్‌షోలకు అయ్యే ప్రతీ ఖర్చును వీడియో సర్వే లైన్స్ టీం సభ్యులు తప్పనిసరిగా రికార్డు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రియాంక ఆల ఆదేశించారు. ఆర్డీవో కార్యాలయంలో సోమవారం ఎన్నికల అకౌంటింగ్ టీమ్ ఆఫీస్ ను ఆమె తనిఖీ చేసి, రికార్డులు పరిశీలించారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల్లో జారీ అయ్యే ఎన్నికల ప్రకటనలను రేట్ల ఆధారంగా అభ్యర్థి ఖర్చులో జమ చేయాలన్నారు. జప్తు చేసిన వాటికి రసీదులు ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో దామోదర్, అసిస్టెంట్ఎక్స్ పెండిచర్అబ్జర్వర్ వేల్పుల శ్రీనివాస్, అకౌంటింగ్ సభ్యులు రాజు తదితరులు పాల్గొన్నారు.