వైరాలో భద్రాద్రి బ్యాంక్ ప్రారంభం

వైరాలో భద్రాద్రి బ్యాంక్ ప్రారంభం

వైరా, వెలుగు: భద్రాద్రి కోపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ 22వ శాఖను వైరాలోని మెయిన్ రోడ్ లో బ్యాంక్ చైర్మన్ చెరుకూరి కృష్ణమూర్తి బుధవారం ప్రారంభించారు. స్ట్రాంగ్ రూమ్ ను వర్తక సంఘం అధ్యక్షుడు వనమా విశ్వేశ్వరరావు, క్యాష్ కౌంటర్ ను హరిహర సుత అయ్యప్ప క్షేత్రం చైర్మన్ కొప్పురావూరి వెంకటేశ్వరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ  ఒక్క శాఖతో ప్రారంభమై నేడు 22వ శాఖను ప్రారంభించామని,70 వేల మంది  ఖాతాదారులు ఉన్నారని తెలిపారు. బ్యాంక్ సుమారు రూ.1000 కోట్ల టర్నోవర్ కు చేరుకుందని చెప్పారు.

 కస్టమర్లకు గృహ వ్యాపార చిన్న తరహా పరిశ్రమలు, ఎడ్యుకేషన్ అన్ని రకాల లోన్స్ ఇవ్వడంతో పాటు అన్ని రకాల సేవలను ప్రజలకు అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ సీఈఓ దాసరి వేణుగోపాల్, డీజీఎం ప్రసాద్, వైస్ చైర్మన్లు సన్నే ఉదయ్ ప్రతాప్, వేములపల్లి వెంకటేశ్వరావు పాల్గొన్నారు.