భద్రాచలం, వెలుగు : లొంగిపోయిన మావోయిస్టులకు చర్ల పీఎస్ లో భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్రాజ్రివార్డులు అందజేశారు. మడివి సోమమ్మ అలియాస్ సునీత, మడకం లింగా అలియాస్ రాకేశ్, మడివి భద్రయ్య అలియాస్ భుద్రకు రూ. 4 లక్షల చొప్పున , కట్టం పొజ్జయ్యకు రూ.40వేలు, కల్ము భుద్రకు రూ.20వేలు అందజేశారు. మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి వచ్చి సాధారణ జీవితం గడపాలని ఎస్పీ రోహిత్‌రాజ్ పిలుపునిచ్చారు. లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించే బాధ్యతను పోలీసులు తీసుకుంటారని
పేర్కొన్నారు.