నర్సరీలపై స్పెషల్​ ఫోకస్​ పెట్టాలి : విద్యా చందన

నర్సరీలపై స్పెషల్​ ఫోకస్​ పెట్టాలి : విద్యా చందన

ములకలపల్లి, వెలుగు : పంచాయతీల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నర్సరీలపై స్పెషల్​ఫోకస్​ పెట్టాలని భద్రాద్రికొత్తగూడెం అడిషనల్ కలెక్టర్, డీఆర్డీవో విద్యా చందన ఆఫీసర్లకు సూచించారు. బుధవారం మండలంలోని సీతారాంపురం, పూసుగూడెం, పీకే రామవరం, మాదారం గ్రామాల్లో ఆమె పర్యటించారు. అంగన్​వాడీ, ప్రాథమిక పాఠశాలలను, నర్సరీలను సందర్శించారు.

అమ్మ ఆదర్శ పాఠశాలల్లో చేపట్టిన పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అంగన్​వాడీ టీచర్లు సమయపాలన పాటించాలని సూచించారు. వర్షాకాలం సీజన్ లో మొక్కలు నాటేందుకు ప్రణాళికలు తయారు చేయాలని చెప్పారు. ఆమె వెంట ఎంపీడీవో భారతి, ఎంపీవో లక్ష్మయ్య, ఏపీవో, జీపీ కార్యదర్శులు ఉన్నారు.