గ్రీవెన్స్ అర్జీలను వెంటనే పరిష్కరించాలి

గ్రీవెన్స్ అర్జీలను వెంటనే పరిష్కరించాలి

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : గ్రీవెన్స్లో వచ్చినఅర్జీలను వెంటనే పరిష్కరించాలని భద్రాద్రికొత్త గూడెం కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహిం చిన గ్రీవెన్స్ లో ఆయన దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు తమసమస్య లు తీరుతాయనే నమ్మకంతో ఎంతో దూరం నుంచి వస్తున్నారని, వారి నమ్మకాన్ని మరింత పెంచేలా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆఫీసర్లకు సూచించారు. 

దేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా కలెక్టరేట్లో ఆయన ఫొటోకు కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యాశాఖ మంత్రి ఆజాద్ సేవలు మరువలేనివని కొనియాడారు.

ఖమ్మంలో 60 వినతులు

ఖమ్మం టౌన్ : ఖమ్మం కలెక్టరేట్ లో ప్రజలనుంచి కలెక్టర్ ముజామ్మిలాఖాన్ దరఖాస్తులను స్వీకరించారు. మొత్తం 60 వినతులు వచ్చాయి. ఇందులో 50 పెన్షన్లు, నిరుద్యోగం, దళితబంధు, కల్యాణలక్ష్మి, ఇండ్ల స్థలాలవి ఉన్నాయి. మిగతా 10 వినతులు ధరణి సమస్యలపై వచ్చాయి. ఈ దరఖాస్తులను ఎట్టి పరిస్థితిలో పెండింగ్ లో ఉంచొద్దని, వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అంతకుముందు మౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మదినం సందర్భంగా కలెక్టరేట్ లో ఆయన ఫొటోకు అడిషనల్ కలెక్టర్ పీ. శ్రీనివాస్ రెడ్డిపూలమాలలు వేసి నివాళులర్పించారు.

కేఎంసీలో...

ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం లో గ్రీవెన్స్ లో వినతులు అందజేసే వారి కోసం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయాలని ఇన్చార్జి కమిషనర్, నగర పాలక సంస్థ అడిషనల్ కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ అన్నారు. కేఎంసీ కార్యాలయంలో గ్రీవెన్స్ డే లో ప్రజల నుంచి దరఖాస్తులను ఆమె స్వీకరించారు.

 వరద బాధితులు కోసం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి, వారి సందేహాలను నివృత్తి చేసేలా చర్యలు చేపట్టాలని ఆమె అధికారులకు సూచించారు. వీడీవోఎస్ కాలనీకి చెందిన అర్జీదా రు తమ ఇంటిదగ్గర ఒక భవనాన్ని నిర్మిస్తున్నార ని, డ్రైనేజ్ పైపును కాల్వలోకి వేసి వాడటం వల్ల దుర్వాసన వస్తుందని ఫిర్యాదు చేయడంతో వెంటనే విచారణ చేపట్టి బిల్డింగ్ ఓనర్ కు రూ.4 వేలు ఫైన్ విధించారు.