‘మునగ’ పెంపకంపై అవగాహన కల్పించాలి : కలెక్టర్​ జితేశ్​ వి పాటిల్​

  • భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్​ జితేశ్​ వి పాటిల్​

జూలూరుపాడు, వెలుగు : మునగ తోటల పెంపకంపై రైతులకు అవగాహన కల్పించాలని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ ​జితేశ్ ​వి పాటిల్​అధికారులను ఆదేశించారు. గురువారం మండల పరిధిలోని చింతలతండా, బేతాళపాడు, కొమ్ముగూడెం, మాచినేనిపేట తండా, రేగళ్ల తండా  గ్రామ పంచాయతీల్లో ఆయన పర్యటించారు. చింతలతండాలోని ఓ రైతు పొలంలో మునగ తోటను పరిశీలించారు. ‘నాటుదాం చెట్టు.. అమ్మ పేరిట’ కార్యక్రమంలో భాగంగా అక్కడ కలెక్టర్​ మునగ మొక్క నాటారు. మునగ సాగుప్రాముఖ్యతను వివరించారు. 

మునగ తోట సాగు చేస్తున్న రైతును అభినందించారు. అనంతరం బేతాళపాడు పంచాయతీలో ఇంకుడు గుంతలను, పాఠశాల భవనాలను పరిశీలించారు. కొమ్ముగూడెంలోని శిథిలావస్థలో ఉన్న పశు వైద్యశాల భవనాన్ని పరిశీలించి వెంటనే తొలగించి కొత్త బిల్డింగ్ ​నిర్మాణం చేపట్టేలని  అధికారులకు సూచించారు. కలెక్టర్​ వెంట స్థానిక సంస్థల అడిషనల్​ కలెక్టర్ విద్యాచందన, ఎంపీడీవో కరుణాకర్ రెడ్డి, ఎంపీవో తులసీరామ్, ఏపీవో రవికుమార్, పశు వైద్యాధికారి బద్దులాల్, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు.