దమ్మపేట, వెలుగు : మండలంలో భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్వి పాటిల్ మంగళవారం ఆకస్మికంగా పర్యటించారు. నేరుగా తహసీల్దార్ కార్యాలయంలో వచ్చి ధరణి పనితీరును పరిశీలించారు. కార్యాలయం ఆవరణ శుభ్రంగా ఉండాలన్నారు.
భూ రిజిస్ట్రేషన్లు, ఇతర అవసరాల కోసం వచ్చే ప్రజలు కూర్చునేందుకు కుర్చీలు ఏర్పాటు చేయాలన్నారు. రైతులతో మాట్లాడి సమస్యలు, అధికారుల నుంచి అందుతున్న సేవలను తెలుసుకున్నారు. రైతులు కలెక్టర్‌ను శాలువాతో సన్మానించారు.