
- భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్ వి పాటిల్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లాలో 18 ఏండ్లు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటరు నమోదు చేసుకోవాలని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్ వి పాటిల్ సూచించారు. కలెక్టరేట్లో పలు రాజకీయ పార్టీలతో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా ఓటర్లకు సంబంధించి ఫారం 6,7, 8లో 19,514 దరఖాస్తులు రాగా, అందులో 10,944 దరఖాస్తులు పరిష్కరించామన్నారు.
1,310 దరఖాస్తులు తిరస్కరించినట్లు తెలిపారు. 7,260 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయన్నారు. బీఎల్ఓ యాప్ నిర్వహణపై శిక్షణా తరగతులు నిర్వహిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో అడిషనల్కలెక్టర్డి.వేణుగోపాల్, ఎన్నికల సూపరింటెండెంట్ధారా ప్రసాద్, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం నేతలు పాల్గొన్నారు.