కొర్రమీను పెంపకంతో మంచి లాభాలు : కలెక్టర్​ జితేశ్​​

కొర్రమీను పెంపకంతో మంచి లాభాలు : కలెక్టర్​ జితేశ్​​
  • భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్​ జితేశ్​​ 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కొర్రమీను చేపల పెంపకంతో మంచి లాభాలు వస్తాయని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ ​జితేశ్ ​వి పాటిల్​ తెలిపారు. కొత్తగూడెం క్లబ్​లో అగ్రికల్చర్​ ఏపీఎంలు, మహిళా సమాఖ్య సభ్యులకు చేపల పెంపకంపై మంగళవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. వ్యవసాయం అన్ని సమయాల్లో కలిసి వస్తోందన్న గ్యారెంటీ లేదన్నారు. అకాల వర్షాలతో ఒక్కోసారి పంట చేతికి అందకుండా పోతుందని తెలిపారు. చేపల పెంపకంతో అధిక లాభాలు పొందవచ్చని చెప్పారు. 

పావు గుంట ప్రదేశంలో ఫాం పౌండ్​ నిర్మాణం చేపట్టి కొర్రమీను చేపలను పెంచవచ్చన్నారు. రూ. 3.50లక్షలు మొదటి సారి ఖర్చు పెడితే సరిపోతుందని, దీనికి బ్యాంకు ద్వారా లోన్​ తీసుకుంటే 35శాతం సబ్సిడీ వస్తుందని వివరించారు. అశ్వాపురం, సుజాతనగర్​లలో ప్రయోగాత్మకంగా కొర్రమీను చేపలు పెంచుతూ లాభాలు గడిస్తున్న రైతుల గురించి చెప్పారు. ఈ ప్రోగ్రాంలో అడిషనల్​ కలెక్టర్​విద్యాచందన, అగ్రికల్చర్​ఆఫీసర్​ బాబూరావు, లీడ్​బ్యాంక్​మేనేజర్ రాంరెడ్డి, పరిశ్రమల శాఖ మేనేజర్​ తిరుపతయ్య, మత్స్యశాఖ ఏడీ ఇంతియాజ్ ఖాన్ పాల్గొన్నారు. 

సమ్మక్క సాగర్ బ్యారేజ్​నుంచి నీళ్లు రిలీజ్..

వేసవి దృష్ట్యా జిల్లాలో తాగు నీటికి ఇబ్బంది లేకుండా సమ్మక్క సాగర్​బ్యారేజ్​నుంచి నీళ్లను రిలీజ్​చేస్తున్నారని కలెక్టర్​ తెలిపారు. మిషన్​ భగీరథ, ఇరిగేషన్​అధికారుల సమన్వయంతో ప్రజలకు నీటి ఎద్దడి లేకుండా చూడాలన్నారు.