అశ్వరావుపేట ఎస్ఐ శ్రీను ఆత్మహత్యాయత్నం

అశ్వరావుపేట ఎస్ఐ శ్రీను ఆత్మహత్యాయత్నం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎస్ఐ శ్రీరాముల శ్రీను ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. జూన్ 30న కనిపించకుండా పోయిన శ్రీను మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ సమీపంలో ఇవాళ తెల్లవారుజామున పురుగుల మందు తాగాడు.  శ్రీనును ముందుగా  మహబూబాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు పోలీసులు.పరిస్థితి విషమంగా ఉండటంతో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. 

ఎస్ ఐ శ్రీను  ఆచూకీ కోసం పోలీస్  సిబ్బంది జూన్ 30  మధ్యాహ్నం నుంచి గాలిస్తున్నారు. కొంతకాలంగా ఎస్ఐ శ్రీను, స్టేషన్  సిబ్బంది మధ్య భేదాభిప్రాయాలు రావడంతో ఒకరిపై ఒకరు ఎస్పీకి ఫిర్యాదు చేసుకున్నారు. తాను అవినీతికి పాల్పడుతున్నట్లుగా సిబ్బంది ప్రచారం చేస్తున్నారని ఎస్ఐ సన్నిహితుల దగ్గర చెప్పుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. 

జులై 1 నుంచి కొత్త చట్టాలు రాబోతున్నాయ్..​ ప్రతి ఒక్కరూ సక్రమంగా పని చేయాలని ఆదివారం స్టేషన్ లో సిబ్బందికి సూచించారు. అనంతరం తన సొంత వెహికల్​లో సొంతంగా డ్రైవింగ్  చేసుకుంటూ వెళ్లిపోయారు. మండలంలోని వినాయకపురం వరకు సెల్  ఫోన్ పని చేసింది. ఆ తరువాత పని చేయకపోవడంతో సిబ్బంది ఎస్ఐ కోసం వెతుకుతున్నారు. జిల్లా ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ఇటీవల జరిగిన క్రైం రివ్యూ మీటింగ్ లో ఉన్నతాధికారులు మందలించినట్లు సిబ్బంది పేర్కొంటున్నారు. ఈ విషయమై సీఐ జితేందర్ రెడ్డిని వివరణ కోరేందుకు ప్రయత్నించగా, ఫోన్  లిఫ్ట్  చేయడం లేదు.  అయితే రాత్రి 11గంటలకు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్న ఎస్సై  తానే  స్వయంగా 108కు ఫోన్ చేశాడు. దీంతో 108 సిబ్బంది దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది మహబూబాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి వరంగల్ తరలించారు.