సీతారామ ప్రాజెక్ట్ పంప్ హౌస్3 ప్రారంభించిన ఉపముఖ్యమంత్రి భట్టి

సీతారామ ప్రాజెక్ట్ పంప్ హౌస్3 ప్రారంభించిన ఉపముఖ్యమంత్రి భట్టి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చేతులు మీదుగా సీతారామ ప్రాజెక్ట్ 3వ పంప్ హౌస్ ను గురువారం ప్రారంభించారు. అధికారులు అన్ని ఏర్పాట్లు చేసి.. ఉపముఖ్యమంత్రి భట్టిని ఆహ్వానించారు. ఆయన ప్రత్యేక పూజలు చేసి పంపి హౌస్ ని ప్రారంభించారు. ములకలపల్లి మండలం కమలాపురం దగ్గర ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు సీతారామ ప్రాజెక్ట్ పంప్ హౌస్ 3 ని తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సిఎం బట్టి విక్రమార్క చేతులు మీదుగా ప్రారంభించారు. కాగా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీతారామ ప్రాజెక్ట్ పూసుగూడెం దగ్గర రెండవ పంప్ హౌస్ ను ఈరోజు సాయంత్రం ప్రారంభించనున్నారు.