భద్రాచలం, వెలుగు : ప్రజాదరణ కోల్పోయి దిక్కుతోచని స్థితిలో మావోయిస్టులు ఉన్మాదుల్లా ప్రవర్తిస్తున్నారని భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఓఎస్డీ సాయిమనోహర్ మంగళవారం ఒక ప్రకటనలో ఆరోపించారు.
సంత వ్యాపారులను దోచుకోవడం, అమాయక ప్రజల వాహనాలను అపహరించడం, దహనం చేయడం లాంటి బందిపోటు చర్యలతో ఉనికి కోసం మావోయిస్టులు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. పనిలేని కొందరు యువకులను ఆర్పీసీ కమిటీల పేర్లతో నియమించి, పోలీస్ ఇన్ఫార్మర్ల నెపంతో చిరువ్యాపారులపై దారిదోపిడీ చర్యలకు పాల్పడుతున్నారని తెలిపారు.