‘అభ’ హెల్త్​ ప్రొఫైల్​ నమోదుకు..ఎంపికైన భద్రాద్రి కొత్తగూడెం

‘అభ’ హెల్త్​ ప్రొఫైల్​ నమోదుకు..ఎంపికైన భద్రాద్రి కొత్తగూడెం

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఆయుష్మాన్​ భారత్​(అభ) లో భాగంగా హెల్త్​ ప్రొఫైల్​ నమోదుకు భద్రాద్రికొత్తగూడెం జిల్లా పైలెట్​ ప్రాజెక్ట్​గా ఎంపికైందని ఏబీడీఎం జాయింట్​ డైరెక్టర్​ మంజునాథ్ నాయక్​పేర్కొన్నారు. జిల్లాలో గురువారం ఆయన పర్యటించారు. కలెక్టరేట్​లోని డీఎంహెచ్​లో ఆఫీస్​లో డీఎంహెచ్​వో భాస్కర్​నాయక్​తో పాటు పలువురు డాక్టర్లతో ఆయన రివ్యూ మీటింగ్​నిర్వహించారు. జిల్లాలోని అన్ని కుటుంబాలు ఆయుష్మాన్​ భారత్​ హెల్త్​ ఐడీలో తమ వివరాలను తప్పకుండా నమోదు చేసుకోవాలన్నారు. ఈ కార్డును పొందేందుకు సమీపంలోని పీహెచ్​సీలతో పాటు గవర్నమెంట్​ హాస్పిటళ్లలో సంప్రదించాలని చెప్పారు. అభ ఆరోగ్య కార్డు ప్రతి ఒక్కరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ప్రతీ ఒక్కరి ఆరోగ్య సమాచారాన్ని కలిగి ఉంటుందని తెలిపారు. ట్రీట్​మెంట్​ చేసేందుకు ఈ డెటా ఎంతగానో ఉపయోగపడుతందన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ డెమో ఫైజ్​ మొహిఉద్దీన్, డీపీవో సళిత, భాను ప్రసాద్, రెహ్మాన్​ పాల్గొన్నారు.