భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య (70) కన్ను మూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ఓప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు. తొలుత హను మంతులపాడు గ్రామపంచాయతీ సర్పంచ్ గా తన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన అబ్బయ్య.. ఉమ్మడి ఏపీలో బూర్గంపాడు నుంచి 1983లో సీపీఐ తరపున తొలిసారి ఎమ్మెల్యేగా గెలిపొందారు. తర్వాత 1994లో ఇల్లెందు నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం 2009లో టీడీపీ తరపున పోటీ చేసి మూడోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించి.. మొత్తం మూడు పర్యాయాలు ప్రజలకు సేవలందించారు. అదేవిధంగా 1999, 2019లో ఇం డిపెండెంట్, 2014లో టీఆర్ఎస్ నుంచి, పోటీ చేసి ఓడిపోయారు.
సీఎం ప్రగాఢ సానుభూతి
గిరిజన నాయకుడు, శాసనసభ మాజీ సభ్యుడు ఊకే అబ్బయ్య మృతి పట్ల ముఖ్య మంత్రి రేవంత్ తీవ్ర సంతాపం వ్యక్తంచేశా రు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఊకే అబ్బయ్య ఉమ్మడి రాష్ట్రంలో మూడు సార్లు ఎమ్మెల్యేగా ప్రజలకు అమూల్యమైన సేవలందించారని గుర్తుచేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, శోక తప్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అబ్బయ్య మృతిపట్ల ఎమ్మెల్యే కోరం కనకయ్య, పలు రాజకీయ పార్టీల నేతలు సంతాపం వ్యక్తం చేశారు.
దించారు.