ఎన్నికలు దగ్గర పడుతుండటంతో బీఆర్ఎస్ కు ఆ పార్టీ సీనియర్ నేతలు, ఉద్యమ కారులు రాజీనామా చేస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడుతున్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రధాన అనుచరుడిగా పేరున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జడ్పీ ఛైర్మన్ కోరం కనయ్య, ఆయన అనుచురులు ఆ బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు.
ఇల్లందు జడ్పీ క్యాంప్ ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తనతో పాటు ఒక జడ్పీటీసీ, 56 మంది సర్పంచులు, 26 మంది ఎంపీటీసీలు, ఒక ఇల్లందు మున్సిపల్ కౌన్సిలర్ ,పీఏసీఎస్ ఛైర్మన్ 3 వే మంది నాయకులు, కార్యకర్తలు రాజీనామా చేశారు. . రాజీనామా చేసిన వారంతా జూలై 2న ఖమ్మంలో జరగనున్న జనగర్జన సభలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు.