భద్రాద్రి కొత్తగూడెం పీఏసీఎస్​జిల్లా కార్యవర్గం ఎన్నిక

చండ్రుగొండ, వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం పీఏసీఎస్​ నూతన జిల్లా కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం బూర్గంపహాడ్​ పీఏసీఎస్​ లో సమావేశమయ్యారు. జిల్లా అధ్యక్షుడిగా లంకా నరసింహారావు, ఉపాధ్యాక్షుడిగా పొన్నోజు ప్రేమాచారి, ప్రధానకార్యదర్శిగా సున్నం వెంకటేశ్వర్లు, గౌరవ సలహాదారుడిగా సయ్యద్​ జిలాని, కోశాధికారిగా వెంకటేశ్వర్లు, సహాయకార్యదర్శిగా జ్ఙానదాసును ఎన్నుకున్నారు.