సుజాతనగర్, వెలుగు : పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు వెంటనే న్యాయం అందేలా సమగ్ర విచారణ చేపట్టాలని భద్రాద్రికొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజ్ సిబ్బందికి సూచించారు. శుక్రవారం సుజాతనగర్ పోలీస్ స్టేషన్ ను ఆయన సందర్శించి రికార్డులను పరిశీలించారు. పలు కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్, ఎస్బీ ఇన్స్పెక్టర్నాగరాజు, సుజాతనగర్ ఎస్సై జుబేదా బేగం, సిబ్బంది పాల్గొన్నారు.