- భద్రాద్రి రామయ్యకు భారీ ఆదాయం
- 298 యుఎస్డాలర్లు, 155 సింగపూర్ డాలర్లు , 30 యుఏఈ దిర్హామ్స్
- 85 ఆస్ట్రేలియా డాలర్లు, ఒక ఖతార్ రియాల్, 45 యూరోలు, 20 కెనడా డాలర్లు
భద్రాచలం, వెలుగు : భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ హుండీలను గురువారం లెక్కించారు. మొత్తం 38 రోజులకు సంబంధించిన హుండీలను లెక్కించగా రూ.1,13,23,178ల ఆదాయం వచ్చింది. వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా నిర్వహించిన తెప్పోత్సవం, ఉత్తర ద్వారదర్శనానికి భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో ఆదాయం పెరిగింది.
హుండీల ద్వారా 298 యుఎస్డాలర్లు, 155 సింగపూర్ డాలర్లు , 30 యుఏఈ దిర్హామ్స్, 85 ఆస్ట్రేలియా డాలర్లు, ఒక ఖతార్ రియాల్, 45 యూరోలు, 20 కెనడా డాలర్లు వచ్చాయని ఈవో రమాదేవి తెలిపారు. మరో వైపు ప్రధాన ఆలయంలో గురువారం ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ, బాలభోగం నివేదించిన అనంతరం బేడా మండపంలో సీతారాముల కల్యాణం జరిపించారు. సాయంత్రం దర్బారు సేవ చేశారు.