ఇంటి వద్దకే రామయ్య కల్యాణ తలంబ్రాలు : రాజ్యలక్ష్మి

సత్తుపల్లి, వెలుగు:  భద్రాద్రి రాములోరి కల్యాణ ముత్యాల తలంబ్రాలను ఆర్టీసీ కార్గో ద్వారా నేరుగా ఇంటికే పంపిణీ చేయనున్నట్లు డిపో మేనేజర్ రాజ్యలక్ష్మి తెలిపారు. సోమవారం స్థానిక డిపో ఆవరణలో తలంబ్రాల పంపిణీ పోస్టర్ ను ఆమె ఆవిష్కరించారు. శ్రీరామనవమికి భద్రాచలం వెళ్లలేని భక్తుల కోసం టీఎస్​ఆర్టీసీ లాజిస్టిక్స్ ద్వారా రూ.151కే నేరుగా ఇంటి వద్దకు తలంబ్రాలను అందించనున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు కార్గో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ 9154298585 నంబర్ ను సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ విజయశ్రీ, రాములు, బాబురావు, పీపీ రావు, ఎస్కే మునీర్ పాషా, కిరణ్ బాబు, కిన్నెర ఆనందరావు తదితరులు పాల్గొన్నారు.