
భద్రాచలం, వెలుగు: భద్రాద్రి సీతారామచంద్రస్వామికి హుండీల ద్వారా రూ. 1.14 కోట్ల ఆదాయం వచ్చింది. 42 రోజులకు సంబంధించిన హుండీలను గురువారం ఈవో రమాదేవి పర్యవేక్షణలో లెక్కించారు. మొత్తం రూ.1,14,60,041 పాటు, 133 గ్రాముల బంగారం, 1,262 గ్రాముల వెండి వచ్చినట్లు ఈవో తెలిపారు.
అలాగే 50 కెనడా, 293 యూఎస్, 7 సింగపూర్ డాలర్లు, 10 యూరప్ యూరోస్, 50 మలేషియా రింగిట్స్, 5 చైనా యువాన్స్, 2 ఖతార్ రియాల్స్, ఒక సౌదీ రియాల్, 5 నేపాల్ రూపీస్, 10 యునైటెడ్ ఎమిరేట్స్ దిర్హామ్స్ వచ్చాయి. కౌంటింగ్ పూర్తయ్యాక మొత్తం నగదును బ్యాంకులో డిపాజిట్ చేసినట్లు ఈవో తెలిపారు.