భద్రాద్రి ఆలయ ప్రధానార్చకుడి రాజీనామా

భద్రాచలం, వెలుగు :  శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం ప్రధాన అర్చకుడు కె.శ్రావణకుమారాచార్యులు తన పదవికి రాజీనామా చేశారు. 2022 జులై నెల నుంచి ఆయన దీర్ఘకాలిక సెలవు తీసుకుని అమెరికాలో ఉంటున్నారు. కొంత కాలం సాధారణ సెలవులు, తర్వాత మెడికల్​ లీవ్  తీసుకున్నారు. ఇటీవలే మళ్లీ సెలవులు కావాలంటూ మెయిల్​ ద్వారా ఈఓ రమాదేవికి ఆయన విజ్ఞప్తి చేశారు. 

సంతకం లేకుండా సెలవులు ఇవ్వలేమని, వచ్చి మాట్లాడాలని సూచించారు. ఇందుకు కొంత టైం కావాలని ఆయన కోరారు. అయితే, అమెరికాలోని ఓ గుడిలో ఆయన పనిచేస్తున్నట్లు సమాచారం. దీంతో రాజీనామా చేయాలని దేవస్థానం సూచించింది. దీనిపై గతంలోనే ప్రకటన కూడా ఇచ్చారు. ఎట్టకేలకు తాను ప్రధాన అర్చక పదవికి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొంటూ మెయిల్​ ద్వారా శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానానికి శ్రావణకుమారాచార్యులు సమాచారం ఇచ్చారు. దీంతో ఆయన రాజీనామాను ఈఓ 
ఆమోదించారు.