గొత్తికోయలు అడవులను వదిలి రోడ్లకు దగ్గరగా రావాలి

గొత్తికోయలు అడవులను వదిలి  రోడ్లకు దగ్గరగా రావాలి
  • భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్​ జితేశ్​ వి పాటిల్​ 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : గొత్తికోయలు అడవులను వదిలి రోడ్లకు దగ్గరగా రావాలని కలెక్టర్​జితేశ్ వి పాటిల్​ సూచించారు. మిషన్​ భగీరథ ఈఈ తిరుమలేశ్​తో కలిసి లక్ష్మీదేవిపల్లి మండలంలోని చింతలమేది, మద్దిగుంపులలోని గొత్తికోయ ఆవాసాల్లో బైక్​పై గురువారం ఆయన పర్యటించారు. గొత్తికోయలతో మాట్లాడారు. వారి జీవన పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. తాగునీటి కోసం ఏర్పాటు చేసుకున్న చెలమలను పరిశీలించారు.

పోడు కొట్టడం నేరమని వివరించారు. గొత్తి కోయల సంక్షేమానికి కృషి చేస్తున్నామన్నారు. దట్టమైన అటవీ ప్రాంతాల నుంచి గొత్తికోయలు రోడ్డుకు సమీపానికి తమ నివాసాలను మార్చుకోవాలని సూచించారు. రహదారి, తాగునీటి సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కలెక్టర్​ వెంట ఎంపీడీవో చలపతి రావు, మిషన్​ భగీరథ డీఈ శివయ్య, ఏఈ వెంకటస్వామి, పంచాయతీ సెక్రటరీలు, ఫారెస్ట్​ అధికారులు పాల్గొన్నారు. 

చట్టాలపై మహిళలకు అవగాహన ఉండాలి

మహిళలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్​ జితేశ్, జిల్లా న్యాయసేవాధికారి సంస్థ సెక్రటరీ భానుమతి అన్నారు. కలెక్టరేట్​లో జిల్లా లీగల్​ సర్వీసెస్​ అథారిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీటింగ్​లో వారు మాట్లాడారు. పని ప్రదేశాల్లో మహిళలపై వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వేధింపులపై మహిళలు నేరుగా ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు. 

వాహనదారులకు ఇబ్బందుల్లేకుండా చూడాలి

అన్నపురెడ్డిపల్లి : అన్నపురెడ్డిపల్లి మండలంలోని గుంపెన గ్రామ శివారులోని సీతారామప్రాజెక్టు బ్రిడ్జి వద్ద వాహనాదురులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్ ఆఫీసర్ల ను ఆదేశించారు. సీతారామ కాలువపై నిర్మించిన  బ్రిడ్జిని ఆయన పరిశీలించారు. తాత్కాలికంగా నిర్మించిన అప్రోచ్ రోడ్డు ను తొలగించి, కాలువలో నీరు పారేలా చూడాలన్నారు. కాలువ ముంపు రైతుల పరిహారం విషయమై ఆఫీసర్లను అడిగి తెలుసుకున్నారు. మద్దుకూరు గ్రామంలో తయారుచేస్తున్న సిమెంట్ బ్రిక్స్ ఫ్యాక్టరీ ని 
సందర్శించారు. 

ప్రణాళికల రూపకల్పనకు ‘డ్రోన్’ ఉపయోగం 

పాల్వంచ : పాల్వంచ మున్సిపాలిటీలో డిజిటల్ సర్వే తో మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. పట్టణంలో పూజలు చేసి డ్రోన్ సర్వే ను ఆయన ప్రారంభించారు. అభివృద్ధిలో భా గంగా సమస్యలు లేని మున్సిపాలిటీల కోసం ఈ సర్వేను నిర్వహిస్తున్నామన్నారు. లేటెస్ట్ టెక్నా లజీ, డ్రోన్ కెమెరాలతో చేస్తున్న సర్వే అనేక సమస్యల పరిష్కారానికి దోహద పడుతుందని తెలిపారు.కేంద్ర ప్రభుత్వం అమృత్ 2.0 స్కీం కింద రాష్ట్రంలో 50 వేల నుంచి లక్ష జనాభా కలిగిన 20 మున్సిపాలిటీలను మాస్టర్ ప్లా న్ డిజిటల్ సర్వే చేయడం కోసం ఎంపిక చేసిందని వివరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్​కలెక్టర్లు వేణుగోపాల్, విద్యా చందన ఉన్నారు.