ప్రభుత్వ ఆస్పత్రుల్లో 24 గంటలు వైద్య సేవలు అందాలి

ప్రభుత్వ ఆస్పత్రుల్లో  24 గంటలు వైద్య సేవలు అందాలి
  • భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్​ వి పాటిల్​ 
  • పాల్వంచ ఆస్పత్రిలో తనిఖీ

పాల్వంచ, వెలుగు : ప్రభుత్వ ఆస్పత్రుల్లో 24 గంటలు వైద్య సేవలు అందించాలని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్​ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. బుధవారం పాల్వంచలోని ప్రభుత్వ దవాఖానాను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించారు. 

కుక్క కాటుకు అందుబాటులో ఉన్న మందులపై ఆరా తీశారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలని సూపరింటెండెంట్ రామ్ ప్రసాద్ కు సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు శైలేశ్, మోహన్ వంశీ, ప్రసాద్, లావణ్య, సరళ, రాంప్రసాద్ పాల్గొన్నారు.