నీటిని పొదుపుగా వాడుకోవాలి : జితేశ్ వి పాటిల్

నీటిని పొదుపుగా వాడుకోవాలి : జితేశ్ వి పాటిల్
  • భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్ వి పాటిల్ 

పాల్వంచ, వెలుగు : వేసవిలో నీటిని పొదుపుగా వాడుకోవాలని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్ ​వి పాటిల్ ప్రజలకు సూచించారు. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా శనివారం మండలంలోని జగన్నాథపురంలో నిర్వహించిన అవగాహన కార్య క్రమంలో ఆయన మాట్లాడారు. 

భూగర్భ జలాలు అడుగంటుతున్న తరుణంలో ప్రతి ఒక్కరూ నీటి పొదుపుపై అవగాహన పెంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మార్క్ ఫెడ్ డైరెక్టర్ కొత్వాల శ్రీని వాసరావు, అడిషనల్​ కలెక్టర్ విద్యాచందన, గ్రౌండ్ వాటర్ డీడీ రమేశ్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, డీపీవో చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.