భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఓపెన్ ఇంటర్, టెన్త్ ఎగ్జామ్స్ పక్కాగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని భద్రాద్రికొత్తగూడెం అడిషనల్కలెక్టర్ వేణుగోపాల్అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్లో పలు శాఖల అధికారులతో నిర్వహించిన మీటింగ్లో ఆయన మాట్లాడారు. ఈ నెల 25 నుంచి మే 2 వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎగ్జామ్స్నిర్వహించనున్నట్లు తెలిపారు. టెన్త్ ఎగ్జామ్స్కు జిల్లాలో మూడు సెంటర్లు, ఇంటర్మీడియట్కు నాలుగు సెంటర్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
ఓపెన్ టెన్త్ ఎగ్జామ్స్కు 846 మంది, ఇంటర్లో 978 మంది ఎగ్జామ్స్కు అటెండ్ కానున్నారని తెలిపారు. ఎగ్జామ్స్ సెంటర్ల ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. ఎగ్జామ్స్ సెంటర్లలో తాగునీరు, ఇతర సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో ఇంటర్మీడియట్ జిల్లా అధికారి సులోచనా రాణి, డీఈవో వెంకటేశ్వరాచారితో పాటు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.