దశలవారీగా హాస్పిటల్​ సమస్యలు పరిష్కరిస్తాం :కలెక్టర్​ జితేశ్​ వి పాటిల్​

దశలవారీగా హాస్పిటల్​ సమస్యలు పరిష్కరిస్తాం :కలెక్టర్​ జితేశ్​ వి పాటిల్​
  • భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్​ జితేశ్​ వి పాటిల్​

భద్రాచలం, వెలుగు  :  భద్రాచలం ఏరియా హాస్పిటల్​లో సమస్యలను దశలవారీగా అన్నీ పరిష్కరిస్తామని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్​జితేశ్​వి పాటిల్​ తెలిపారు. బుధవారం ఆయన ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణతో పాటు ఏపీ, ఛత్తీస్​గఢ్, ఒడిశా రాష్ట్రాల గిరిజనులు భద్రాచలం ఏరియా ఆస్పత్రికి చికిత్స కోసం వస్తుంటారని, ఈ నేపథ్యంలో అన్ని సౌకర్యాలు మెరుగుపరచడానికి యాక్షన్​ ప్లాన్​ సిద్ధం చేసినట్లుగా తెలిపారు.

ముందుగా సిబ్బంది కొరత, భర్తీపై దృష్టిసారించి నెలరోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. అవసరమైన భవనాల కోసం ఎస్టిమేషన్లు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. సిబ్బంది రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరింస్తే చర్యలు తీసుకుంటామని 
హెచ్చరించారు. 


బూర్గంపహాడ్ : బూర్గంపహాడ్ లోని ప్రభుత్వ ఆస్పత్రిని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఐటీసీ సహకారంతో ఆస్పత్రి ఆవరణలో నిర్మించిన పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణ ప్లానింగ్ పై అసంతృప్తి వ్యక్తం చేశారు. హాస్పిటల్​ సూపరింటెండెంట్ తో సమావేశమై సమస్యలపై చర్చించారు. కాగా గురుకుల పాఠశాలతో పాటు పలు సమస్యలపై  స్థానికులు కలెక్టర్ కు వినతిపత్రం అందచేశారు. ఈ కార్యక్రమంలో డీసీహెచ్ వో రవిబాబు, తహసీల్దార్ ముజాహిద్, డాక్టర్లు అనిత, సబితా రెడ్డి, మౌనిక పాల్గొన్నారు.