భద్రాద్రికొత్తగూడెంలో ఘనంగా బతుకమ్మ సంబురాలు

భద్రాద్రికొత్తగూడెం/ ఖమ్మం రూరల్​, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం కలెక్టరేట్​లో శుక్రవారం రాత్రి బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహించారు. కలెక్టర్​ డాక్టర్​ ప్రియాంక అల బతుకమ్మను నెత్తిన పెట్టుకొని కలెక్టరేట్​ ఆవరణలో ఏర్పాటు చేసిన సంబరాల వద్ద తీసుకు వచ్చారు. మహిళా ఆఫీసర్లు, కలెక్టరేట్​ సిబ్బందితో కలిసి బతుకమ్మ ఆడి సందడి చేశారు.

ఖమ్మం రూరల్ మండలం పెద్దతండాలోని ప్రియదర్శిని ఉమెన్​ ఇంజినీరింగ్ కాలేజీలో మహిళా లెక్చరర్లు, విద్యార్థినులు బతుకమ్మలు పేర్చి ఆట, పాటలతో ఆకట్టుకున్నారు. కొత్తగూడెంలోని సింగరేణి హెడ్ ఆఫీస్ ఆధ్వర్యంలోనూ బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి.  ‌‌‌‌‌‌‌‌