కూర్మావతారంలో భద్రాద్రి రామయ్య

కూర్మావతారంలో భద్రాద్రి రామయ్య

భద్రాచలం, వెలుగు :  భద్రాచలంలో జరుగుతున్న అధ్యయనోత్సవాల్లో భాగంగా బుధవారం రామచంద్రస్వామి కూర్మావతారంలో దర్శనమిచ్చారు. అంతకుముందు స్వామి వారి ఉత్సవమూర్తులను ప్రాకార మండపానికి తీసుకొచ్చి పంచామృతాలతో అభిషేకం చేశారు. కూర్మావతారంలో అలంకరించిన అనంతరం బేడా మండపానికి తీసుకొచ్చి ప్రత్యేక పూజలు, వేద విన్నపాలు చేశారు. నాళాయర దివ్యప్రబంధం, వేదపారాయణం చేశారు. అనంతరం కూర్మావతారంలో ఉన్న శ్రీరాముడిని భక్తుల కోలాటాలు, జయజయధ్వానాలు, రామనామ సంకీర్తనల మధ్య మిథిలా ప్రాంగణంలోని వేదికపైకి తీసుకొచ్చి భక్తులకు దర్శనం కల్పించారు. సాయంత్రం తిరువీధి సేవ నిర్వహించారు.