సామ్రాజ్యలక్ష్మి అవతారంలో అమ్మవారి దర్శనం

గ్రేటర్ ఖిలా వరంగల్, వెలుగు : భద్రకాళీభద్రేశ్వరి కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం అమ్మవారు సామ్రాజ్యలక్ష్మిగా భక్తులకు దర్శనమి చ్చారు. ఈ సందర్భంగా దేవాలయ ఈవో శేషు భారతి శేషుమాట్లాడుతూ ఉత్సవాల సందర్భం గా 32 మంది దేవకన్యలు వేసే ప్రశ్నల వర్షానికి ప్రత్యురత్తరమిస్తూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ తన సర్వజ్ఞత్వాన్ని తెలుపుతూ సాలభంజిక వాహనం మీద సేవింపబుడుతున్న అమ్మవారిని దర్శిస్తే సకల శక్తులు సమకూరుతాయన్నారు.

కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో చందనోత్సవం భద్రకాళీ భద్రేశ్వర కల్యాణ బ్రహ్మోత్సవాల్లో

భాగంగా వరంగల్ జిల్లా కుమ్మరిసంఘం ఆధ్వర్యంలో చందనోత్సవం నిర్వహించారు. అమ్మ వారిని వాహనంపై సామ్రాజ్యలక్ష్మిగా అలంకరించి ఊరేగింపు చేపట్టారు. అనంతరం. అన్నదానం చేశారు కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రకుమ్మరి సంఘం ఉపాధ్యక్షుడు అవునూరి రామ్మూర్తి, వరంగల్ జిల్లా అధ్యక్షుడు రుద్రా రపు కుమారస్వామి అమంచి నాగపరిసుళ.. ప్రదీప్, అనసూయ. రామూర్తి కుమారస్వా మి. ప్రజాపతి, ప్రకాశ్, నాగరాజు, రాజుగో పాల్, శ్రీనివాస్, సత్యం, భక్తులు తదితరులు పాల్గొన్నారు.