వరంగల్ లోని భద్రకాళి చెరువుకు గండి కొట్టారు అధికారులు. భద్రకాళి చెరువు ప్రక్షాళనలో భాగంగా 900 ఏళ్ల క్రితం కాకతీయుల కాలంలో నిర్మించిన రాతి కట్టడం మత్తడి బండ్ కు గండి కొట్టారు. చెరువులోని నీరంతా దిగువకు వదిలేసి అందులో పూడికతీత, గుర్రపుడెక్క తొలగించటంలో భాగంగా గండి కొట్టారు అధికారులు. ఈ క్రమంలో రోజుకు 500 క్యూసేక్ ల చొప్పున చెరువు నీటిని దిగువకు వదులుతున్నారు.
ప్రస్తుతం 382 ఎకరాల విస్తీర్ణం లో ఉన్న భద్రకాళి చెరువు పూర్తి నీటి సామర్థ్యం 150 ఎంసిఎఫ్టీలు కాగా.. ప్రస్తుతం 100 ఎంసిఎఫ్టీల నీరు నిల్వ ఉన్నట్లు తెలిపారు అధికారులు. దిగువన కాలనీలు ముంపుకు గురికాకుండా అప్రమత్తం చేశారు అధికారులు.అయితే... భద్రకాళి చెరువు ప్రక్షాళన పనులను అడ్డుకున్నారు మత్స్య కారులు.
మత్తడికి గండి కొడుతుండగా అడ్డుపడ్డారు మత్స్యకారులు. తమకు ప్రత్యామ్నాయం చూపిన తర్వాతే నీరు ఖాలీ చేయాలని డిమాండ్ చేశారు. మత్స్యకారులు అడ్డుకోవడం వెనక ఫిషరీస్ శాఖ అధికారుల హస్తం ఉందని అంటున్నారు ఇరిగేషన్ అధికారులు.