పోలీస్‍ కావాల్సినోడు.. బతుకు పోరాటం చేస్తుండు

పోలీస్‍ కావాల్సినోడు.. బతుకు పోరాటం చేస్తుండు
  • భద్రకాళి బాంబ్ బ్లాస్ట్​ బాధితుడు సురేష్‍ దుస్థితి
  • మూడున్నరేండ్లుగా ఎన్నో ఆపరేషన్లు.. రూ.10 లక్షల అప్పు
  • 22న మరో ఆపరేషన్‍.. డబ్బుల కోసం ఇక్కట్లు

వరంగల్‍ రూరల్‍, వెలుగు: 4 జులై 2017.. వరంగల్​లోని భద్రకాళి ఫైర్ వర్క్స్​లో బాంబ్‍ బ్లాస్ట్ జరిగిన రోజు. వంద, రెండు వందల కోసం అందులో బాంబులు చుట్టడానికి కూలీలుగా వచ్చి 10 మంది రక్తపు ముద్దగా మారిన చీకటిరోజు. అదే ఘటనలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. బతికి ఉన్నాడని తప్పితే.. మూడున్నరేండ్లుగా మంచం దిగకుండా నిత్యనరకం అనుభవిస్తున్నాడు. అతనే కొండపల్లి సురేష్‍. మంచి జూడో ప్లేయ‌‌ర్. ఏనుమాముల మార్కెట్ బాలాజీన‌‌గ‌‌ర్‌‌కు చెందిన అతను పోలీస్ జాబ్​కొట్టాలని ప్రిపేర్‍ అయ్యాడు. చేతి ఖర్చుల కోసం భద్రకాళి ఫైర్​వర్క్స్​లో పని చేశాడు. జాబ్‍ రావాలంటే కోచింగ్‌‌ తీసుకోవడానికి హైదరాబాద్‍ వెళ్లాలని డిసైడ్ అయ్యాడు.  కావాల్సిన ఫీజుల కోసం అప్పటివరకు బాంబుల తయారీ  కేంద్రంలో ప‌‌నిచేసిన డబ్బులు తెచ్చుకుందామని అక్కడికి వెళ్లాడు. అంత‌‌లోనే బాంబులు పేలాయి. బ‌‌య‌‌ట‌‌కు ప‌‌రుగు తీస్తుండగా ఓ పెద్ద బాంబు అత‌‌ని ఎడమ కాలిని బ‌‌లంగా ఢీకొట్టింది. ఎక్కడికక్కడ మాంసం ముద్దలా మారింది.

మూడున్నరేండ్లుగా మంచంలో నరకయాతన

బాంబ్‍ బ్లాస్ట్ ఘట‌‌న‌‌లో సురేష్‍ కాలు నుజ్జు నుజ్జయింది. దాంతో డాక్టర్లు ఎడ‌‌మ కాలు తీసేశారు. అప్పటినుంచి సురేష్‍ మంచానికే ప‌‌రిమిత‌‌మ‌‌య్యాడు. అన్నమైనా, స్నానమైనా మంచం మీదే. చివరికి బాత్రూం పోవాలన్నా అక్కడే. 60 ఏండ్ల వయసులో తల్లిదండ్రులు ఎల్లవ్వ, జంపయ్య సేవలు చేస్తున్నారు. మనిషి చనిపోలేదనే కారణంతో సర్కారు పెద్దగా సాయం చేయలేదు. బాంబుల దుకాణం ఓనర్‍ అధికార పార్టీకి చెందిన వ్యక్తి కావడంతో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. సర్కారు తరఫున ఇచ్చిన డబ్బులు కనీసం హాస్పిటల్‍ ఖర్చులకు కూడా సరిపోలేదు. ఏటా ఆపరేషన్ల మీద ఆపరేషన్లు చేస్తున్నారు. పేరేంట్స్​రూ.10 లక్షలు అప్పు చేశారు. మళ్లీ ఫిబ్రవరి 22న హైదరాబాద్​లో మరో ఆపరేషన్‍ చేయాల్సి ఉంది. దీనికి కావాల్సిన రూ.2 లక్షల కోసం సురేష్‍ ఫ్యామిలీ మెంబర్స్​ కనపడ్డ ప్రతి ఒక్కరినీ రిక్వెస్ట్​ చేస్తున్నారు. సాయం చేయాలనుకునేవారు 9542569014 నంబర్​కు ఫోన్​ చేయవచ్చు.

For More News..

సాదాబైనామాలకు పట్టాలు ఇస్తలేరు.. పెండింగ్‌లో 9 లక్షల అప్లికేషన్లు

కాళేశ్వరంలో టన్నెల్‌‌ కాదని పైప్​లైన్లు ఎందుకు? ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కేంద్రం

నా కొడుకు, కోడలు హత్య  వెనుక పుట్ట మధు ఉన్నడు