భద్రాచలం శ్రీరామనవమి ఆదాయం రూ.2.69 కోట్లు

భద్రాచలం శ్రీరామనవమి ఆదాయం  రూ.2.69 కోట్లు

భద్రాచలం, వెలుగు : భద్రాచలంలో జరిగిన శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి వారికి భారీ మొత్తంలో ఆదాయం సమకూరింది. ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన సెక్టార్, పరోక్ష సేవలు, అంతరాలయ అర్చన పోస్టల్, తలంబ్రాలు, ప్రసాదాల అమ్మకం ద్వారా ఆలయానికి మొత్తం రూ.2,69, 09,390 ఆదాయం వచ్చిందని ఆఫీసర్లు వెల్లడించారు. గతేడాది బ్రహ్మోత్సవాల్లో రూ.1,89,61,124ల ఇన్‌‌‌‌కం రాగా ఈ సారి రూ.79,48,266ల ఆదాయం ఎక్కువగా వచ్చిందని ఈవో రమాదేవి పేర్కొన్నారు. 

ఇందులో సెక్టార్​ టిక్కెట్ల ద్వారా రూ.1,32,83,000 రాగా పరోక్ష సేవ రూ. 5 వేల టిక్కెట్ల ద్వారా రూ. 3.45 లక్షలు, రూ.1,116ల టిక్కెట్ల  ద్వారా రూ.5,02,200లు, పోస్టల్‌‌‌‌ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ బుక్‌‌‌‌ చేసిన అంతరాలయ అర్చన టిక్కెట్ల ద్వారా రూ.8,78,150లు, తలంబ్రాల ప్యాకెట్ల ద్వారా రూ.6,64,225లు, కార్గో కింద ఆర్టీసీ పంపిన తలంబ్రాల ప్యాకెట్ల ద్వారా రూ.41,09,200లు, దేవస్థానం వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లో తలంబ్రాల అమ్మకం ద్వారా రూ.5,06,750లు, ఆలయంలో ప్రచార శాఖ తలంబ్రాల ప్యాకెట్లు అమ్మడం ద్వారా రూ.13,87,051ల ఆదాయం వచ్చింది. అలాగే చిన్న లడ్డూ ప్రసాదాల అమ్మకంతో రూ.49,07,775లు, పెద్ద లడ్డూల అమ్మకం ద్వారా రూ.2.89 లక్షలు, పులిహోర రూ.30 వేలు, చక్కెర పొంగలిపై రూ.4,140లు, బెల్లం రవ్వ కేసరి ద్వారా రూ.2,900లు వచ్చినట్లు ఈవో వెల్లడించారు.