స్వాతంత్య్ర సమరయోధుడు భగత్‌సింగ్‌ను 93ఏండ్ల క్రితం విచారించిన చారిత్రక పూంచ్హౌస్లోని భగత్‌సింగ్ గ్యాలరీని పాకిస్తాన్‌లోని పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జాహిద్ అక్తర్ జమన్ ప్రారంభించారు. ఈ గ్యాలరీలో భగత్‌సింగ్ ఫొటోలు, లేఖలు, నాటి వార్తాపత్రికలు, జీవిత విశేషాలు, ఆయన గురించి ప్రచురితమైన స్మారక వ్యాసాలు, భగత్‌సింగ్ బృంద విచారణ వివరాలు ప్రజలకు అందుబాటులో ఉంటాయి.
- పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రభుత్వం తొలిసారిగా 2018లో భగత్‌సింగ్ కేసుకు సంబంధించిన కొన్ని రికార్డులను ప్రదర్శించింది.
- బ్రిటీష్ పోలీస్ అధికారి జాన్ సి.శాండర్స్‌ను హత్య చేశారన్న నేరాభియోగంపై భగత్‌సింగ్‌తోపాటు రాజ్ గురుపై అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం కేసులు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించిన పత్రాలను తాజాగా పంజాబ్ ప్రభుత్వం గ్యాలరీలో ఉంచింది.
- ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడన్న నేరంపై భగత్‌సింగ్‌ను 23ఏండ్ల వయస్సులో బ్రిటీష్ ప్రభుత్వంపై 1931, మార్చి 23న లాహోర్‌లో ఉరితీసింది.
- భగత్‌సింగ్ మెమోరియల్ ఫౌండేషన్ చైర్మన్ అడ్వకేట్ ఇంతియాజ్ రషీద్ ఖురేషి మాట్లాడుతూ ఈ గ్యాలరీకి షాడ్మాన్ చౌక్‌గా నామకరణం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
-వెలుగు, సక్సెస్-