నల్గొండ అర్బన్, నడిగూడెం (మునగాల), చండూరు, కోదాడ,వెలుగు : భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్ దేవ్స్ఫూర్తితో ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేయాలని లెఫ్ట్ పార్టీలు, సంఘాల నేతలు పిలుపునిచ్చారు. శనివారం భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్ దేవ్ వర్ధంతి సందర్భంగా జిల్లా, మండల కేంద్రాల్లో డీవైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్, సీపీఐ, సీపీఎం, సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో వారి ఫొటోలకు పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బరిగెల వెంకటేశ్
డీవైఎఫ్ఐ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు కాసాని కిషోర్ , నల్గొండ జిల్లా కార్యదర్శి మల్లం మహేశ్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఆకారపు నరేశ్, కార్యదర్శి ఖమ్మం పాటి శంకర్ మాట్లాడుతూ.. అనంతరం వారు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్య పోరాటంలో భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాండిచారని గుర్తుచేశారు. 23 ఏండ్లకే తన ప్రాణాన్ని తృణప్రాయంగా వదిలి పెట్టిన భగత్ సింగ్‌ను యువతకు ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.