భగవద్గీతే అన్ని సమస్యలకు పరిష్కారం: గోల్డెన్​ టెంపుల్లో వైభవంగా గీతా జయంతి

భగవద్గీతే అన్ని సమస్యలకు పరిష్కారం: గోల్డెన్​ టెంపుల్లో వైభవంగా గీతా జయంతి

హైదరాబాద్ సిటీ, వెలుగు: మానవ జీవితంలో అన్ని సమస్యలకు భగవద్గీత పరిష్కార మార్గం చూపుతుందని హరేకృష్ణ మూవ్​మెంట్​హైదరాబాద్​అధ్యక్షుడు సత్య గౌరచంద్ర దాస ప్రభూజీ చెప్పారు. గీతా సందేశం కుల, మత, ప్రాంతాలకు అతీతమని, గీతను చదవడం, ఆచరించడం ద్వారా జీవితంలో పరిపూర్ణతను సాధించగలుగుతామని తెలిపారు.

బుధవారం బంజారాహిల్స్ లోని హరేకృష్ణ గోల్డెన్​టెంపుల్​లో గీతా జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం వరకు జరిగిన సంపూర్ణ గీతా పారాయణంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భగవద్గీతలోని 700 శ్లోకాలను పఠించారు. సత్య గౌరచంద్ర దాస ప్రభూజీ మాట్లాడుతూ.. 5 వేల ఏండ్ల కింద శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతా జ్ఞానాన్ని అందించిన రోజు అని, దానికి గుర్తుగా గీతలోని 18 అధ్యాయాల నుంచి మొత్తం 700 శ్లోకాలను పఠించి ఈ రోజును జరుపుకుంటామని ఆయన తెలియజేశారు.