మెదక్టౌన్, వెలుగు: భగవద్గీతలోని ప్రతి అంశం ఎంతో విలువైనదని ప్రస్తుతం విద్యార్థులకు బోధించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని మెదక్ శ్రీసరస్వతీ శిశుమందిర్ కోశాధికారి మహంకాళి అశోక్ అన్నారు. బుధవారం భగవద్గీత జయంతిని పురస్కరించుకొని మెదక్ పట్టణంలోని శ్రీ సరస్వతీ శిశు మందిరంలో విద్యార్థులతో కలిసి వేడుకలను నిర్వహించారు.
ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ.. భగవద్గీతను ప్రతి ఇంట్లో ఉంచడంతో పాటు పఠించాలని తెలిపారు. అనంతరం భగవద్గీత శ్లోకాలు పోటీని నిర్వహించి విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆనంద్ రెడ్డి, ఆచార్యులు సద్గుణ, సుధారాణి, చంద్రశేఖర్, సుజాత, అవంతి, వందన, విద్యార్థులు పాల్గొన్నారు.