భగవద్గీతకు యునెస్కో గుర్తింపు

భగవద్గీతకు యునెస్కో గుర్తింపు

ఢిల్లీ: భారతీయ సంస్కృతి, వారసత్వానికి చరి త్రాత్మక గౌరపం దక్కింది. భగవద్గీత, భరతము నీ రచించిన నాట్యశాస్త్రానికి యునెస్కో మెమొరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్ చోటు లభించింది. 

ఈ విషయాన్ని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. దీనిపై ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ఇది భారతీయ సంస్కృతి, తాత్విక వారసత్వానికి దక్కిన చా రిత్రక గుర్తింపు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం. ఇవి శతామన నాగరికత, ప్రజల్లో చైతన్యాన్ని పెంపొందించాయి. ప్రపంచానికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి' అని తెలిపారు.