దంచవే మేనత్త పాట తీసేసి..మళ్ళీ కలిపారు..ఎందుకో తెలుసా?

అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శత్వంలో నందమూరి బాలకృష్ణ (Balakrishna) హీరోగా నటించిన భగవంత్ కేసరి( Bhagavanth Kesari) సినిమా సుపర్ హిట్ టాక్ తో దుసుకుపోతుంది.. ఈ సినిమాలో బాలకృష్ణని చూపించిన విధానం చాల బాగుందని..ముఖ్యంగా శ్రీలీల నటన ఈ సినిమాకి చాలా ప్లస్ అవుతుందని పేక్షకులు నుంచి వినిపిస్తున్న మాట..అలాగే ఈ సినిమాలో బాలకృష్ణ,శ్రీలీల కాంబినేషన్లో వచ్చే ఎమోషన్ సీన్లు పేక్షకులని వీపరీతంగా అకట్టుకుంటున్నాయి. థియేటర్స్ లో కొంత మంది మహిళలు కంటనీరు పెడుతున్నారు.         

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం..పేక్షకుల డిమాండ్ మేరకు..ముందుగా భగవంత్ కేసరి నుంచి తీసేసిన పుల్ లెంగ్త్ సాంగ్ ని మళ్ళీ యాడ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తుంది.బాలయ్య అల్ టైం ట్రెండింగ్ సాంగ్  అయిన దంచవే మేనత్త కూతురా సాంగ్ అని సమాచారం. చాలా ఖర్చుతో తెరికెక్కించిన ఈ సాంగ్.. స్త్రీ శక్తిని ప్రతిబింబించేలా ఉన్న ఈ కధకు అడ్డు పడుతుందని తీసేశారు అంట. ఇక్కడ విశేషం ఏంటంటే ఈ సాంగ్ లో బాలకృష్ణతో పాటుగా శ్రీలీల, కాజల్ కూడ స్టెప్పులు వేశారు. 

ALSO READ :- ODI World Cup 2023: మనం మనం ఒకటే..: రషీద్‌ ఖాన్‌తో కలిసి చిందేసిన ఇర్ఫాన్‌ పఠాన్‌

ఈ సాంగ్ మెత్తం ఎక్కడ యాడ్ చేసిన..సినిమా ప్లో దెబ్బతింటుందని భావించిన చిత్ర యూనిట్. అది కూడా సినిమా మధ్యలో కాకుండా.. సినిమా ఎండ్ టైటిల్స్ తో పాటుగా ఈ సాంగ్ రన్ అవుతుందని డైరక్టర్ అనిల్ రావిపూడి చెప్పారు. ఈ బిట్ సాంగ్ ని భారీ ఖర్చుతో 100 మంది డ్యాన్సర్లతో తెరికెక్కించారు. ఇక సాంగ్ యాడ్ తో థియేటర్లో మాస్ జాతర షురూ కానుంది.