కరీంనగర్ టౌన్,వెలుగు : ఇటీవల సైన్స్ ఒలింపియాడ్ ఫౌండేషన్, ఢిల్లీ వారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన సైన్స్ ఇంగ్లీష్, మ్యాథ్స్ ఒలింపియాడ్ లో స్థానిక భగవతి స్టూడెంట్లు అద్భుత ప్రతిభ కనబర్చి గోల్డ్ మెడల్స్ సాధించినట్లు చైర్మన్ రమణారావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
అంతర్జాతీయస్థాయి ఇంగ్లీష్ ఒలింపియాడ్ లో హరిణి, అంతర్జాతీయస్థాయి సైన్స్ ఒలింపియాడ్ నుంచి ఆరాధ్య రెడ్డి, రవిచంద్రతో పాటు అంతర్జాతీయస్థాయి మాథ్స్ ఒలింపియాడ్‌లో అయేశా, శ్రీనిష్, హరిణి, ఆశ్రిత్ సాయి, రవిచంద్ర రెండో స్థానంలో నిలిచినట్లు, మొత్తం ఏడుగురు విద్యార్థులు గోల్డ్ మెడల్స్ సాధించినట్లు వివరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్, టీచర్లు, స్టూడెంట్లు పాల్గొన్నారు.