బీర్కూర్, వెలుగు : బీర్కూరు మండల కేంద్రంలోని ఉర్దూ ఉన్నత పాఠశాల వద్ద గల మంచినీటి ట్యాంకుకు మిషన్ భగీరథ పైపు లైన్ కనెక్షన్ ఇచ్చారు. భూమిలో నుంచి పైప్ లైన్ వేయాల్సి ఉండగా, భూమి పై నుంచి పైప్లైన్ వేసి ఆఫీసర్లు చేతులు దులుపుకున్నారు.
నీటి ఒత్తిడికి సోమవారం ఆ పైప్ లైన్ ఊడిపోయి నీరంతా వృథాగా పోతుంది. ఆఫీసర్ల నిర్లక్ష్యంతో తాగునీరు వృథా అవుతుందని ప్రజలు మండిపడుతున్నారు. వారి పనితీరుపై ప్రజలు విమర్శలు చేస్తున్నారు.