నటిగా నన్ను నేను.. నిరూపించుకునే సినిమా

అతి తక్కువ టైమ్‌‌‌‌లో టాలీవుడ్‌‌‌‌లో స్టార్ హీరోయిన్‌‌‌‌ స్టేటస్‌‌‌‌ను అందుకుంది శ్రీలీల. మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్‌‌‌‌గా దూసుకెళ్తున్న ఆమె... బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి తీసిన ‘భగవంత్ కేసరి’ చిత్రంలో కీలక పాత్ర పోషించింది. అక్టోబర్ 19న సినిమా విడుదలవుతున్న సందర్భంగా శ్రీలీల చెప్పిన విశేషాలు..

గ్లామర్ రోల్స్ చేయడానికి చాలా సినిమాలు ఉంటాయి. కానీ ఓ ఎమోషనల్ డ్రైవ్, నటనకు ఆస్కారం ఉండే పాత్రలున్న సినిమా ఇది.  ఒక నటిగా నన్ను నేను నిరూపించుకునే అవకాశం దొరికింది.  బాలకృష్ణ గారితో నటించే చాన్స్ రావడం నిజంగా ఓ బ్లెస్సింగ్‌‌‌‌.  ఫస్ట్‌‌‌‌టైమ్ ఆయన్ని చూసినప్పుడు  కొంత భయంగా అనిపించినా, కలిసిన మరుక్షణమే ఆ భయం పోయింది.  ఆయనది పసి మనసు. చాలా స్వీట్ పర్సన్. నిజంగా ఆయనకి యాప్ట్ పేరు పెట్టారు. సినిమా కాకుండా వివిధ రంగాలపై ఆయనకి చాలా నాలెడ్జ్ ఉంది.  షూటింగ్ సమయంలో కూడా ఒక సీన్ ఎలా చేస్తే బావుంటుందో చెప్పేవారు.  విజ్జి పాప పాత్రలో నేను కనిపిస్తా. బాలకృష్ణ గారు ‘నేలకొండ భగవంత్ కేసరి’గా నటించారు.  మా ఇద్దరి మధ్య ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్  చాలా బ్యూటిఫుల్‌‌‌‌గా ఉంటుంది. ‘ఆడ పిల్ల లేడీ పిల్లలా కాదు.. పులి పిల్లలా ఉండాలి’ అనే  డైలాగ్ ఇందులో ఉంది. అదే తపనతో నేను కూడా నటించాను.  ఇక కాజల్ గారితో వర్క్ చేయడం వండర్‌‌‌‌‌‌‌‌ఫుల్ ఎక్స్‌‌‌‌పీరియెన్స్. తనతో కూడా నాకు కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి. ఆమె కామెడీ టైమింగ్ నాకు చాలా నచ్చింది. ఆమె నుంచి చాలా విషయాలు నేర్చుకోవాలి. కాజల్ బ్యూటీ విత్ బ్రెయిన్. తన గత చిత్రాలకు భిన్నంగా అనిల్ దీన్ని రూపొందించారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా తీశారు. ఇక నాకు వరుస అవకాశాలు రావడం బాధ్యతగా భావిస్తున్నా. నాకు మొదట అవకాశం ఇచ్చిన రాఘవేంద్రరావు గారికి, నాపై నమ్మకం ఉంచిన ప్రతి దర్శకుడికి ధన్యవాదాలు’’.