చండీఘడ్ను పంజాబ్కు బదిలీ చేయాలని తీర్మానం

చండీఘడ్: కేంద్రపాలిత ప్రాంతమైన చండీఘడ్ను వెంటనే పంజాబ్కు బదిలీ చేయాలని సీఎం భగవంత్ మాన్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు పంజాబ్ అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కేంద్రం ఆధీనంలో ఉన్న చండీఘడ్ నిర్వాహణలో సమతుల్యత దెబ్బతీసేందుకు మోడీ సర్కారు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. పంజాబ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 1966 ప్రకారం.. పంజాబ్ను హర్యానా రాష్ట్రంగా, చండీఘడ్ను కేంద్రపాలిత ప్రాంతంగా విభజించడంతో పాటు కొన్ని ప్రాంతాలను హిమాచల్ ప్రదేశ్ కు ఇచ్చారని తీర్మానంలో పేర్కొన్నారు. అప్పటి నుంచి భాక్రా బియాస్ మేనేజ్‌మెంట్ బోర్డ్ తదితర ఉమ్మడి ఆస్తుల నిర్వహణలో పంజాబ్, హర్యానా రాష్ట్ర నామినీలకు కొన్ని మేనేజ్‌మెంట్ పదవులు ఇస్తూ సమతుల్యం పాటిస్తున్నారని చెప్పారు. ఇటీవల తీసుకుంటున్న చర్యలతో కేంద్ర ప్రభుత్వం సమతుల్యత దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందని భగవంత్ మాన్ ఆరోపించారు. పంజాబ్, హర్యానా అధికారులతో భర్తీ చేసే భాక్రా బియాస్ మేనేజ్ మెంట్ బోర్డు సభ్యుల పోస్టులను అన్ని రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వ అధికారులతో భర్తీ కోసం కేంద్రం ప్రకటన జారీ చేసిందని విమర్శించారు. 

గతంలో చండీఘడ్ పరిపాలన 60:40 నిష్పత్తిలో పంజాబ్, హర్యానా అధికారులు నిర్వహించే వారని ఇటీవల కేంద్రం ఆ సంప్రదాయాన్ని పక్కనపెట్టి బయటి అధికారులను నియమించిందని ఆరోపించారు. చండీఘడ్ అడ్మినిస్ట్రేషన్లోని ఉద్యోగులకు సెంట్రల్ సివిల్ సర్వీస్ నియమాలు ప్రవేశపెట్టడాన్ని మాన్ తప్పుబడుతున్నారు. ఈ నేపథ్యంలో చండీఘడ్ ను తక్షణమే పంజాబ్కు బదిలీ చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. 

మరిన్ని వార్తల కోసం..

ఎంజీఎంలో ఎలుకల దాడి మా నిర్లక్ష్యమే

ఢిల్లీలో తమిళనాడు సీఎం స్టాలిన్ పర్యటన