ఎన్టీఆర్ మార్గ్ లోనే సెప్టెంబర్ 17న గణేష్ విగ్రహాల నిమజ్జనం జరుగుతుందన్నారు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ జనరల్ సెక్రటరీ రాజవర్ధన్ రెడ్డి. గత నాలుగు ఐదు సంవత్సరాలుగా గణేష్ ఉత్సవాల సమయంలో కోర్టుకు వెళ్లడం ఆనవాయితీగా మారిందన్నారు. గత పిటిషన్ రీ ఓపెన్ చేయమని పీవోపీ ( ప్లాస్లర్ఆఫ్ ప్యారీస్) విగ్రహాల స్టే ఇవ్వమని కంటెంట్ పిటిషన్ వేశారు. దీనిని హై కోర్టు కొట్టేసింది. అలాగే విగ్రహ తయారీ వాళ్లు రిట్ పిటిషన్ వేశారు. పీవోపీ విగ్రహాలపై కూడా హై కోర్టు సానుకూలంగా స్పందించిందని చెప్పారు. పీవోపీ విగ్రహాలను నిమజ్జనం చేయడానికి కూడా కోర్టు అనుమతి ఇచ్చిందని చెప్పారు. 2021లో ఇచ్చిన హై కోర్టు తీర్పు ప్రకారం నిమజ్జనం చేయాలని కోర్టు వెల్లడించింది. ఆ ఆదేశాల ప్రకారం మట్టి విగ్రహాలని, పీవోపీ విగ్రహాల నిమజ్జనాన్ని వేరువేరుగా చేయమని హైకోర్టు ఆదేశించిందని వెల్లడించారు. నీటి పొల్యూషన్ జరగకుండా చూడమని కోర్టు చెప్పిందన్నారు. తాము కూడా పొల్యూషన్ జరగకుండా చూడడానికే సహకరిస్తాము.. కానీ అందుకు కొంత సమయం పడుతుందన్నారు రాజవర్దన్ రెడ్డి.
మట్టి విగ్రహాలని పెట్టాలనేది ప్రజల్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉందన్నారు రాజవర్ధన్ రెడ్డి. పీవోపీ విగ్రహాల తయారీకి ఆల్టర్నేట్ ముడి సరుకుని ప్రభుత్వమే అందించే ఏర్పాటు చేయాలన్నారు. గతంలో కూడా వినాయక సాగర్ లో పీవోపీ విగ్రహాలని నిమజ్జనం చేయడానికి ప్రత్యేక ప్రదేశాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. ఇప్పుడు కూడా అలానే ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరాము. అలా చేయడంతో పీవోపీ విగ్రహాల నిమజ్జనం చేసిన తరువాత వాటిని ఈజీగా తొలగించే అవకాశం ఉంటుంది. నిన్నటి నుండి టాంక్ బండ్ పై విగ్రహాల నిమజ్జనం చేయకూడదని ఫ్లెక్సీలు పెట్టడం ప్రజల్లో అనుమానం వ్యక్తం అవుతుంది. ఎన్టీఆర్ మార్గ్ లో విగ్రహాల నిమజ్జనం కొనసాగుతుంది. ప్రభుత్వం కూడా అందుకు ఏర్పాటు చేసింది. డీజేలు పెట్టొద్దని నిబంధనలు పెట్టారు. అందుకు మేము కూడా ఇతరులకు ఇబ్బంది లేకుండా సౌండ్ పెట్టుకోవాలని చెబుతున్నాం. సుప్రీం కోర్టు సౌండ్ పై చెప్పిన విధానాలని కేవలం నిమజ్జనంలో మాత్రమే కాదని ప్రభుత్వం గమనించాలి. చర్చి, మసీదుల్లో కూడా సౌండ్ తక్కువ పెట్టాలని సుప్రీం చెప్పింది. మరి ఆ నిబంధనలు అమలు అవుతున్నాయా లేదా చెప్పాలి. ప్రభుత్వం తమకు సహకరించి నిమజ్జనం సజావుగా జరిపించాలని విజ్ఞప్తి చేశారు.