- మెట్రో ఎండీకి భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి వినతి
హైదరాబాద్ సిటీ, వెలుగు : గణేశ్ నిమజ్జన ఊరేగింపు సమయంలో ఎలాంటి అడ్డంకులు రాకుండా ఓల్డ్ సిటీలో నిర్మించనున్న మెట్రో రైల్ పిల్లర్ల ఎత్తును పెంచాలని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి కోరింది. శనివారం సమితి ప్రతినిధి బృందం బేగంపేటలోని మెట్రో భవన్లో ఎండీ ఎన్వీఎస్ రెడ్డిని కలిసి వినతి పత్రాన్ని అందించారు. ఓల్డ్ సిటీలో ఏటా 25 ఫీట్లకు మించి విగ్రహాలను ఏర్పాటు చేస్తారని తెలిపారు.
ఆ విగ్రహాలు వెహికల్స్ లో ఎక్కిస్తే వాటి ఎత్తు 35 ఫీట్లకు పైనే ఉంటుందని ఎండీకి వివరించారు. బాలాపూర్ మీదుగా ట్యాంక్‌బండ్ వరకు ఊరేగింపు ఉంటుందని వెల్లడించారు. కాబట్టి ఎంజీబీఎస్ నుంచి చార్మినార్, పురాణిహవేలి, ఫలక్‌నుమా, చాంద్రాయణ గుట్ట మార్గాల్లో 7.5 కి.మీ దూరంలో నిర్మిస్తున్న మెట్రో పిల్లర్ల ఎత్తును 40 ఫీట్లకు మించి నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. నిమజ్జన ఊరేగింపు సాఫీగా సాగేందుకు సహకరించాలని మెట్రో ఎండీ కోరారు.
మెట్రో స్టేషన్ పేరు మార్చండి
చైతన్యపురి, ఎల్బీనగర్ మధ్యలో ఉన్న విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ పేరును అష్టలక్ష్మీ టెంపుల్ గా మార్చలని విశ్వహిందూ పరిషత్ సభ్యులుమెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. వలస పాలనకు చిహ్నంగా ఉన్న మెట్రో స్టేషన్ పేరును మార్చాలని కోరారు.