కన్ఫ్యూజన్ వద్దు.. గణేశ్ ఉత్సవాలు జరుపుకోండి

భాగ్యనగర్ ఉత్సవ సమితి
హైదరాబాద్, వెలుగు: గణేశ్ ఉత్సవాలపై కన్ఫ్యూజన్ వద్దని, నిర్భయంగా జరుపుకోవాలని భాగ్యనగర్ ఉత్సవ సమితి జనరల్ సెక్రటరీ భగవంతరావు స్పష్టం చేశారు. మంగళవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. మండపాల నిర్వాహకులే సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని, పూజకు ఐదుగురిని మాత్రమే అనుమతించాలని సూచించారు. కొవిడ్ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలన్నారు. గేటెడ్ కమ్యూనిటీలు, అపార్టుమెంట్ లు, కాలనీలు, గుళ్లు, బస్తీల్లో విగ్రహాల ఏర్పాటుకు పోలీసుల పర్మిషన్ అవసరం లేదన్నారు. విగ్రహాల ఏర్పాటు నుంచి నిమజ్జనం వరకు సాదాసీదాగా, సమూహాలు లేకుండా అధికారులతో సమన్వయం చేసుకోవాలని చెప్పారు. బహిరంగ ప్రదేశాల్లో మండపాలు ఏర్పాటుచేయొద్దని, ఇంట్లోనే వేడుకలు జరుపుకోవాలని సీపీ విడుదల చేసిన ప్రకటనపై అసహనం వ్యక్తంచేశారు. అనంతరం ఉత్సవ కమిటీ సభ్యులపై కేసులు, బైండోవర్లమీద హోం మంత్రికి ఫిర్యాదు చేశారు.

For More News..

సినీ స్టార్స్ తో  ప్లాస్మాపై అవేర్ నెస్

కడప సెంట్రల్ జైళ్లో 317 మందికి కరోనా