మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) కాంబినేషన్లో రూపొందబోయే సినిమాని అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ (People Media Factory)పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తోండగా..వివేక్ కూచిభొట్ల కో ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నారు.
లేటెస్ట్గా ఈ మాస్ ఎంటర్టైనర్ నుంచి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. మాస్ రాజాకి దొరికేసిన క్లాస్ మహారాణి అంటూ..భాగ్యశ్రీ బోర్సె(BhagyashriBorse) ను అధికారికంగా ప్రకటించారు. చాలా రోజుల నుంచి రవితేజకు జోడీ విషయంలో మేకర్స్ తర్జన భర్జన పడగా..చివరికి అదిరిపోయిన కల్ట్ క్లాస్ హీరోయిన్ని పట్టుకొచ్చారంటూ..మాస్ రాజా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో విషెష్ చెబుతున్నారు. రవితేజ ఎనర్జీకి..హరీష్ చూపించే మేకింగ్కు సెట్ అయ్యే బ్యూటీని ఆలోచించి పట్టుకొచ్చారంటే..కథలో భాగ్యశ్రీ పాత్రకి ఇంపార్టెన్స్ ఎలాంటిదో అర్ధమవుతుంది.
భాగ్యశ్రీ తెలుగు సినిమా పరిశ్రమకి మరో కొత్త హీరోయిన్గా పరిచయమవుతోంది. పూణేకు చెందిన మోడల్ భాగ్యశ్రీ..రవితేజకు పర్ఫెక్ట్ జోడీగా కనిపిస్తోంది. అలాగే రిలీజ్ చేసిన పోస్టర్లో భాగ్యశ్రీ నడుమును పట్టుకుంటూ..క్లోజ్గా రవితేజ మూవ్ అవ్వడం చూస్తుంటే..సినిమాలో ఎలాంటి అట్ట్రాక్టింగ్ సీన్స్ ఉండబోతున్నాయనే విషయం అర్ధమవుతోంది.
Introducing the Class Maharani of Mass Maharaja @RaviTeja_offl & @harish2you's #MassReunion ❤?
— People Media Factory (@peoplemediafcy) December 16, 2023
The gorgeous #BhagyashriBorse is all set to add her alluring beauty to Mass Maharaja's trademark energy ❤️?@vishwaprasadtg @vivekkuchibotla @peoplemediafcy pic.twitter.com/GROEAQHT6S
రవితేజ, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రమిది. ‘షాక్’ సినిమాతో హరీష్‌కు దర్శకుడిగా మొదటి అవకాశాన్ని ఇచ్చిన రవితేజ. ఆ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్‌లో ‘మిరపకాయ్’ లాంటి సూపర్ హిట్ సినిమా వచ్చింది. దీంతో రవితేజకు మాస్ మహారాజా అనే ట్యాగ్ ఇచ్చాడు హరీష్. ఇక ‘ధమాకా’ తర్వాత పీపుల్స్ మీడియా సంస్థలో రవితేజ నటిస్తున్న చిత్రమిది. దీంతో ఈ ముగ్గురి కాంబినేషన్‌లో రానున్న ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
The Magical Mass Combo is back ❤️?
— People Media Factory (@peoplemediafcy) December 13, 2023
Mass Maharaja @RaviTeja_offl and @harish2you reunite for an entertainer ??
This time, the #MassReunion gets spicier ??
Produced by @vishwaprasadtg & @vivekkuchibotla under @peoplemediafcy ??
More details soon! pic.twitter.com/OYNmnRuPDx